రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని CM KCR ఇవాళ ప్రారంభించనున్నారు. రూ. 1,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటి. 150 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి… ఏటా 500 కోచ్ లు, 50 లోకో మోటవ్ లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
అలాగే, CM KCR ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆర్సిపురం మండలం కొల్లూరులో నిర్మించిన 15, 660 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను… సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. రూ. 1354. 59 కోట్లతో ఎస్ ప్లస్ 9, ఎస్ 10, ఏ 11 అంతస్తులో 15,660 ఇళ్లను నిర్మించారు. 145.50 ఎకరాల్లో 117 బ్లాకుల్లో నిర్మించిన ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 8.65 లక్షలు ఖర్చు చేశారు.