కేంద్ర బడ్జెట్ పై సీపీఐ నారాయణ రియాక్షన్ ఇదే..!

-

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు  కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. బీహార్ కి 41 వేల కోట్లు, ఏపీకి రూ.15వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో తాజాగా సీపీఐ నేత నారాయణ స్పందించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు. అయినా తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేక పోయారన్నారు. గ్యాస్ ధరలు, నిత్యవసలదారులు విపరీతంగా పెరిగాయి. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని పొలిటికల్ బడ్జెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ లపై ఆధారపడిందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వారిద్దరూ పట్టుబడుతున్నారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీలు శాశ్వత పరిష్కారం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news