మునుపెన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద పారించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. పోలంవరం నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామని, అవసరమైతే ఇంకా ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడంపై కూటమి నేతలు హర్ఫం వ్యక్తరుస్తున్నారు. ముఖ్యంగా ఏపీ మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్నడ్డాక ఏపీ ప్రజలు ఏది ఆశించారో కేంద్ర బడ్జెట్లో అవన్నీ పొందుపరిచరని అన్నారు. అమరావతికి ఇచ్చిన రూ. 15 వేల కోట్లతో రాజధాని పనులుపరుగులు పెడతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం .. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందని విశ్లేషించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని కొందరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందని చెప్పిన నేతలు ఇలాంటి బడ్జెట్‌లతో ఏపీ అభివృద్ధి ఖాయమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు చేశారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌డిఏ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడంతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు.
ఇక ఆంధ్రప్రేదశ్ కు కేంద్రం ప్రత్యేక సాయం చేయడంపై జనసేన నేతలు కూడా అస్సందన తెలియజేశారు. ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించడం సంతోషమని, పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పడం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. ఇవన్నీ ఏపీకి ఎంతో మేలు చేస్తాయని చెప్తూ ఎన్‌డిఏ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు ఎంపీ బాలశౌరి.