ఇవాళ తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల ప్రచారం కొనసాగనుంది. ఈ మేరకు బీజేపీ పార్టీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. హనుమకొండ బిజెపి అభ్యర్థి శ్రీమతి రావు పద్మ మద్దతుగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి విస్తృత ప్రచారం చేయనున్నారు. నిజామాబాద్ అర్బన్ లో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు అన్నామలై ప్రచారం చేస్తారు.

బిజెపి జాతీయ నాయకులు కేంద్రమంత్రి భగవత్ ఖూబ జీ సంగారెడ్డి నియోజకవర్గం లో ప్రచారంలో పాల్గొంటారు. దేవరకొండ, పాలకుర్తి, నర్సం పేట ల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విస్తృత ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, ధర్మపురి నియోజకవర్గము లో ప్రచారంలో పాల్గొంటారు. కాగా… నిన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యోగి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.