నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే

0
66

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు భూపాలపల్లిలోని జై శంకర్ చౌక్ నుంచి సెంటినరీ కాలనీలోని పన్నూరు వరకు జరిగే విజయభేరి యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 4:30కు పెద్దపల్లిలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని, సాయంత్రం 5:45 పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు విజయభేరి యాత్ర చేయనున్నారు.

సాయంత్రం 7కు కేఎన్ఆర్ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ నుంచి రాజీవ్ చౌక్ వరకు పాదయాత్ర చేసి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. కుంభమేళా తరహాలోనే సమక్క-సారలమ్మ జాతరను అధికారిక జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదివాసుల కోసం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తాం. అభివృద్ధి గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. పోడు భూములపై ఆదివాసీలకు హక్కుల కల్పిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించాం అని తెలిపారు.