డ్రగ్స్ అమ్మకం కేసులు ముగ్గురు అరెస్ట్..!

-

రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న డ్రగ్ ఫెడ్లర్ ఆనాస్ ఖాన్ పై నిఘా ఉంచాం. అనాజ్ ఖాన్ తో పాటు నైజీరియాన్ మరొక నిందితుడు రాజేంద్రనగర్లో ఒక చోట కలుస్తున్నారు అని సమాచారం అందింది అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కెట్ బ్యూరో బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసాం.

నిందితుల వద్ద నుండి కోటి పది లక్షల విలువ చేసి ఆరు రకాల డ్రగ్స్ సీజ్ చేసాం. పట్టుబట్ట వారిలో ఓఫెజర్ సండే ఏజికా ఫ్రాంక్ అనే అతను కొకైన్ అనస్ కు సప్లై చేశాడు. అయతే ఈ ఓఫోజర్ సండే ఎజిక్ అలియాస్ ఫ్రాంక్ అనే విదేశీయుడు నైజీరియాకు చెందినవాడు. బెంగళూరు లో తక్కువ ధరకు నైజీరియాన్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో రెట్టింపు దరకు సరఫరా చేస్తాడు. అయతే ఈ కేసులో మరో నిందితుడు అనాస్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందినవాడు. ఆనాస్ ఖాన్ డ్రగ్స్ బానిస. 2022 సంవత్సరంలో వారు హైదరాబాద్‌కు వచ్చారు. డ్రగ్ సరఫరాదారుడు అయిన ఫ్రాంక్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. హైదరాబాద్‌ లో తన సోదరుడు సైఫ్ ఖాన్ సహాయంతో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నాడు. అయతే ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసు బృందానికి మూడు లక్షల రివార్డు ప్రకటించాం అని కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news