రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం. ఇప్పుడు కూడా హైజెనిక్ ఆహారం పేద ప్రజలకు తక్కువ రేటుకు , అందించాలనే ఆలోచన తో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అన్న క్యాంటిన్ లు నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తాం.
అన్న క్యాంటిన్ లలో రాష్ట్రం మొత్తం ఒకే మెనూ అమలు చేస్తున్నాం. పేదలకు మూడుపూటలా కేవలం 15 రూపాయలతోనే కడుపు నింపే పథకం ఈ అన్న క్యాంటిన్లు. గుంటూరులో ఏడు అన్న క్యాంటిన్లు ఆగస్టు 15 న ప్రారంభిస్తున్నారు. YCP ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానంతో పథకాలు అన్నీ నిర్వీర్యం చేసారు. అయతే వైసీపీ వారు విమర్శంంచినట్లు అన్న క్యాంటిన్ లో ఎటువంటి అవినీతి జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారు మంత్రి నారాయణ స్పష్టం చేసారు.