పానీపూరి అంటే మీకూ ఇష్టమేనా..? తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

-

చాలా మంది ఎక్కువగా పానీపూరి ని ఇష్ట పడుతూ ఉంటారు. బయట పానీపూరిని కొనుగోలు చేసి తింటూ ఉంటారు. నిజానికి పానీపూరి వలన కూడా కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు. పానీపూరి ని వివిధ చోట్ల వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్ బాగా ఫేమస్ అయ్యింది ఇందులో కూరగా ఉడికించిన బంగాళదుంపలు లేదంటే బఠాణి పెడుతూ ఉంటారు.

పుదీనా నీళ్లు వేసుకుని తింటే పానీపూరి రుచి చాలా బాగుంటుంది. అయితే పానీపూరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో ఉండే బంగాళదుంప వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. గోధుమలను కూడా ఇందులో వాడుతూ ఉంటారు కాబట్టి హాని చెయ్యదు. పానీపూరిలో వాడే నీళ్లు ఉడికించిన పదార్ధాల వల్ల ఎలాంటి హాని ఉండదు.

శరీరానికి క్యాలరీలు కూడా తక్కువగానే అందుతాయి. పానీపూరిని ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు తింటే కూడా మంచిదే. అల్లం, పుదీనా, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర వంటివి ఇందులో వాడతారు. అలానే మిరియాలు కూడా వాడతారు. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. దీనిలో ఉపయోగించే పుదీనా ఆకుల రసం కూడా శరీరానికి మంచే చేస్తుంది. నోటి దుర్వాసన మొదలు నోటి సమస్యల వరకు చికిత్సగా పని చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చు.

కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వివిధ రకాల కారణాల వలన రోడ్డు మీద ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లో తయారు చేసుకుని తీసుకోవచ్చు. బయట తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కలగొచ్చు. కాబట్టి ఈ పానీపూరీని బయట తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలానే చాలామంది పానీ పూరి చేసేవాళ్లు మంచినీళ్ళని ఉపయోగించరు. కాబట్టి వీటివల్ల ప్రమాదం కలుగుతుంది. హైజీన్ తక్కువ ఉంటుంది కాబట్టి సమస్య కలగొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version