మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేయలేదట. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేసే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఎంపీలు పాల్గొనలేదని సమాచారం అందుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓట్ వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గడిపారట.
19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఓటింగ్ జరిగింది. అదే రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి ఏఐసీసీ కార్యాలయంలో మాణిక్ ఠాక్రే రూమ్‌లో వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, మాజీ మంత్రి వినోద్. అటు సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్ వార్ రూమ్‌కి వెళ్లారు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగా అక్కడికే వచ్చారట. ఈ తరుణంలోనే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ వేయలేదట ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.