తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లేఖ రాశారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఇవాళ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు నాకు ఇబ్బందికరంగా మారాయని ఈ లేఖలో వివరించారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.

బీఆర్ఎస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయని… బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చడం కార్యకర్తలకు ఇష్టం లేదని…. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ తెలంగాణలో నష్టం వాటిల్లిందన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని ఆగ్రహించారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కాగా.. నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..