ధాన్యం పక్కదారిపై మంత్రి తుమ్మల సీరియస్..!

-

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం మిల్లర్లు ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం అక్రమార్కుల చేతిలో కి వెళ్లడం పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపు పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ధాన్యం పక్కదారి పట్టడానికి కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక అధికారులతో లోతైన విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

అలాగే జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని దీనిలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించవద్దన్నారు. పారదర్శక పాలనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దుర్వినియోగానికి పాల్పడిన వారికి శిక్ష తప్పదన్నారు. ధాన్యం అక్రమ రవాణాపై ప్రత్యేక విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ నమోదు చేయాలన్నారు. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని మంత్రి తుమ్మల కలెక్టర్ ను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news