Tiger Spotted Near Miyapur Metro Station in Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాదులోని మియాపూర్ లో చిరుత కలకలం రేపింది. జనాల మధ్యలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోనే చిరుత… సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

దీంతో ఈ విషయం… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోనే చిరుత తిరుగుతున్న వీడియోను… ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో నిజమేనని అందరూ భయపడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని గురించి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచరించిందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే చిరుత సంచరించినట్లు వార్తలు రావడంతో.. మియాపూర్ స్థానికులు గజగజ వనికి పోతున్నారు.