ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ వర్షం గండంగా… మారనుంది. ఇప్పటికే ఏపీని వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న విజయవాడ వరదలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వర్షాలు పడనున్నాయట. బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక ఇవాళ అలాగే రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని కూడా తెలిపింది.