బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారందరూ కలిసి కెసిఆర్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాగా, అనారోగ్యం కారణంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. దీంతో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెమ్ స్పీకర్ గా వారితో ప్రమాణం చేయిస్తారు. తొలుత సీఎం, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి ఈనెల 13 లేదా 14న ప్రారంభమవుతుంది. కాగా, సిఎస్ శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా అసెంబ్లీ ప్రాంగణం లో ఏర్పాట్లు పూర్తిచేశారు.