గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మికుల బృందం సమావేశం ముగిసింది. గంటకుపైగా గవర్నర్‌తో టీఎంయూ నాయకులు చర్చించారు. గవర్నర్ తమిళిసై తమ సమస్యలు విన్నారని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. బిల్లు ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని.. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ తెలిపారని చెప్పారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నామని థామస్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వివరణ తనకు అందలేదని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లు ఆమోదిస్తానని గవర్నర్ తెలిపారు. కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని గవర్నర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు గతంలోనూ అండగా ఉన్నానని గవర్నర్ గుర్తు చేశారు. అని థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపే బిల్లుకు అనుమతి కోరిన ప్రభుత్వాన్ని.. ఐదు అంశాలపై సమగ్ర వివరణ పంపించాలని గవర్నర్ తమిళిసై కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్‌ను చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై టీఎంయూ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి.. ఈ విషయంపై చర్చించారు.