ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి కౌశిక్‌ రెడ్డి..పోలీసులు అలర్ట్‌ !

-

శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్‌ రెడ్డి పంచాయితీ ముగిసేలా కనిపించడం లేదు. ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి బీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఈ కార్యక్రమానికి కౌశిక్‌ కూడా వస్తున్నారట.

Today at 11 am a wide level meeting of BRS party of Serilingampally Constituency will be held at the residence of Serilingampally MLA Arikapudi Gandhi.

ఈ తరుణంలోనే.. శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. గురువారం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news