Telangana: ఇవాళ ఆ ఉద్యోగులు, కార్మికులకు జీతంతో కూడిన హాలిడే

-

Telangana: ఇవాళ ఆ ఉద్యోగులు, కార్మికులకు జీతంతో కూడిన హాలిడే ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. ఇవాళ జరిగే లోక్ సభ ఎన్నికల సందర్బంగా అన్ని ఫ్యాక్టరీలు, షాపులు, ఎస్టాబ్లిషమెంట్స్, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ లలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మొత్తం రోజును వేతనంతో కూడిన హాలిడే గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో అన్ని ఫ్యాక్టరీలు, షాపులు, ఎస్టాబ్లిషమెంట్స్, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ లలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్.. ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత లోక్‌సభ ఎన్నికల్లో 96 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news