Telangana: ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష….ఈ రూల్స్‌ కచ్చితంగా పాటించాల్సిందే

-

తెలంగాణలో గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. 563 పోస్ట్ లతో ఈ నోటిఫికేషన్ గతంలోనే విడుదల చేశారు. ఇక ఇవాళ ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు గ్రూప్ – I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10:00 గంటలకే గేట్లు క్లోజ్ అవుతుంది. పరీక్ష సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

Today is group 1 prelims exam

శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ హాజరు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద CC కెమెరాల ఏర్పాటు చేశారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక RC చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలు (RC) ఉంటారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు. పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పని చేస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 రాస్తున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.

ఈ క్రింది వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి:

🔹ఉదయం 9 గంటలలోగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

🔹మీ హాల్ టికెట్ మరియు అనుమతించబడిన IDని మర్చిపోకుండా తీసుకెళ్లండి.

🔹బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లండి.

🔹సెల్ ఫోన్లు, వాచీలు, వాలెట్లు తీసుకెళ్లవద్దు. బూట్లు లేదా నగలు ధరించవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news