హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహానగరంలో మరో పర్యాటక క్షేత్రం ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన లేఖ్ ఫ్రంట్ పార్క్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పార్కును హెచ్ఎండిఏ సుమారు 26 కోట్లతో పది ఎకరాలలో నిర్మించింది.
మరోవైపు మూసి మరియు ఈశా నదులపై వంతలను నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నిన్న శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇవాళ లేఖ్ ఫ్రంట్ పార్క్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కాగా 2020లో వరదలు వచ్చినప్పుడూ ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని. ఇప్పుడు అన్నింటినీ పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలనే ఎస్టీపీలను నిర్మిస్తున్నామన్నారు. దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జి కంటే మరింత అందమైన బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని వెల్లడించారు.