నేడు కామారెడ్డిలో కేటీఆర్, మంచిర్యాలలో హరీష్ రావు పర్యటన

-

నేడు కామారెడ్డి జిల్లాలో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండులో మంత్రి కేటీఆర్ సభను నిర్వహించనున్నారు. 10 వేల మందితో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ కూడా నిర్వహించనున్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ టూర్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.

Today, KTR visited Kamareddy and Harish Rao visited Manchiryal

ఇక కేటీఆర్‌ బహిరంగ సభ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే… తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వివిధ పార్టీల నేతల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు. అటు మంచిర్యాల జిల్లా లో మంత్రి హరిష్ రావు ఇవాళ పర్యటించనున్నారు. మంచిర్యాల , చెన్నూర్ నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు మంత్రి హరీష్ రావు. అనంతరం దొనబండలో బహిరంగ సభ, చెన్నూరు లో రోడ్ షో లో పాల్గొననున్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version