పహిల్వాన్‌ల ఘర్షణలో ప్రేక్షకులకు గాయాలు.. ఎల్బీ స్టేడియంలో ఘటన

-

ఇద్దరు పహిల్వాన్ల మధ్య చోటుచేసుకున్న గొడవ ఘర్షణకు దారి తీసింది. అంతటితో ఆగకుండా వారి గొడవ ప్రేక్షకులకు గాయాలు చేసింది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో మోదీకేసరి కుస్తీ పోటీల్లో ఇద్దరు పహిల్వాన్ల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలకు చెందిన ఒకరిపైకి మరొకరు… కుర్చీలతో దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి.

ఈ గొడవలో ప్రేక్షకులు కూడా గాయపడ్డారు. భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. కొంత మంది ప్రేక్షకులుక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. గొడవపడిన ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నట్లు.. గొడవకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version