నేడు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు అందజేయనున్నారు మంత్రి హరీష్ రావు. అలాగే..మెదక్ జిల్లా రామాయంపేటలో నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారు.

అటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మంత్రి హరీష్ రావు. ఈ తరుణంలోనే.. నేడు మెదక్ కి రానున్నారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ పర్యటించనున్నారు. మెదక్ లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్నారు మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్. అటు మంత్రి హరీష్ రావు కూడా మెదక్ రానున్న తరుణంలోనే… వీరిద్దరి మధ్య విమర్శల పర్వం కొనసాగుతుందని అందరూ అనుకుంటున్నారు.