ఇవాళ దళితబంధు రెండో విడత ప్రారంభం

-

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు. రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది.

ఇక తాజాగా మూడో విడతలో 36వేల 884 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. మూడో విడతలో భాగంగా ఇవాళ 19వేల 20 మందికి పంపిణీ చేయనున్నారు. మిగతా ఇళ్లను ఈనెల 5వ తేదీన అందించనున్నారు. ఈరోజు.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో హోం మంత్రి మహమూద్‌ అలీ, చేవేళ్ల పరిధిలోని శంకర్‌ పల్లిలో గనుల శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తారు.మన్‌సాన్‌పల్లి, అబ్దుల్లాపూర్‌ మెట్‌లలో  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి నల్లగండ్లలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఇళ్ల పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news