నేడు సమ్మక్క-సారలక్క వన ప్రవేశం.. జాతర ముగింపు

-

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నేటితో చివరి ఘట్టానికి చేరుకున్నది. గద్దెలపై కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలు నేడు సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. చిలుకలగుట్టకు సమ్మక్క-సారలమ్మలు ఇవాళ సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగియనుంది.

అయితే అప్పటివరకు మేడారం జాతరకు కోటి 20 లక్షల మంది వచ్చినట్టు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మంది వరకు తల్లులను దర్శించుకున్నట్టు వెల్లడించారు అధికారులు. సమ్మక్క ప్రతిరూపం అయిన కుంకుమ భరణీ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజారులు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుయనుంది. జంపన్న వాగులో భక్తుల స్నానాలు, వనదేవతలకు మొక్కలు, భారీగా పోలీసులు, ఇతర అధికార యంత్రాంగంతో మేడారం పరిసరాలు కిక్కిరిసపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news