ఓవైసీ కేసులో నేడే తుది తీర్పు.. పాత బ‌స్తీలో భారీ బందోబ‌స్తు

-

నిజామాబాద్, నిర్మ‌ల్ జిల్లాలో తొమ్మిది ఏళ్ల క్రితం బ‌హిరంగ స‌భ‌ల్లో మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌సంగించార‌ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ పై కేసు న‌మోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు ను నాంపల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు విచార‌ణ చేస్తుంది. కాగ ఈ కేసులో తుది తీర్పును నాంపల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు వెలువ‌డ‌నుంది. దీంతో హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో ప్ర‌భుత్వం అద‌న‌పు బ‌ల‌గాల‌తో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది.

ఇప్ప‌టికే ఈ కేసులో వాద‌న‌లు విన్న నాంపల్లి ప్ర‌జా ప్రతినిధుల కోర్టు ఈ రోజు తుది తీర్పును వెలువ‌రిచే అవ‌కాశం ఉంది. ఈ విచార‌ణ‌లో మొత్తం 30 మంది సాక్షులను కోర్టు ప్ర‌శ్నించింది. అలాగే ప్ర‌సంగంలో వాయిస్ అక్బ‌రుద్దీన్ దే అని ఫోరెన్సిక్ సైన్స్ స్ప‌ష్టం చేసింది. కాగ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ.. మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేవిధంగా ప్ర‌సంగించార‌ని పోలీసులు 153 ఏ, 295 ఏ సెక్షన్ల కింద కేసుల‌ను న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version