బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర..పెట్రోల్, డీజిల్ మాత్రం ఇలా

-

సామాన్యులకి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఏప్రిల్ 13న మాత్రం ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 119.47 వద్ద, రూ. 105.47 వద్ద వున్నాయి. ఇది ఇలా ఉంటే గత ఆరు రోజుల నుండి ఫ్యూయెల్ రేట్లు స్థిరంగా వున్నాయి. ఇది ఏడవ రోజు.

గుంటూరు అమరావతిలో పెట్రోల్ ధర రూ. 121.26 వద్ద, డీజిల్ ధర రూ. 106.87 వద్ద వున్నాయి. అన్ని చోట్ల కూడా నిలకడగానే వున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. ముడి చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్‌కు 100 డాలర్లు దాటేశాయి. ట్రెంట్ ఆయిల్ ధర 0.38 శాతం పెరిగింది దీనితో 105 డాలర్లకు పెరిగితే, డబ్ల్యూటీఐ క్రూడ్ రేటు 0.4 శాతం పెరుగుదలతో 101 డాలర్లకు ఎగసింది.

అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెట్రోలియం శాఖ, ఆర్థిక శాఖ మధ్య పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ కనుక తగ్గితే రిలీఫ్ గా ఉంటుంది. 2021 నవంబర్ నెలలో కూడా ఇంధన ధరలపై సుంకాలను కేంద్రం తగ్గించేసింది.

అప్పుడు పెట్రోల్ ధర రూ. 5 మేర తగ్గింది. డీజిల్ రేటు రూ. 10 దిగి వచ్చింది. ఇక మరో వైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పెంపు కనుక జరిగితే తీవ్ర ఇబ్బందులని ఎదుర్కోక తప్పదు. ప్రజలపై మరింత ప్రతికూల ప్రభావం దీని వలన పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version