వాహనదారుకుల బిగ్ షాక్. హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ చార్జీలను 5 నుంచి 10% మేర పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం ఏటా టోల్ ధరలను సవరిస్తుంటారు.
ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. టోల్ వసూళ్ల విషయంలో మార్పులు చేస్తూ ఎన్ హెచ్ఏఐ కేంద్ర రోడ్డు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. మార్చి చివరివారం నాటికి దీనిపై నిపుణుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కార్లకు, సాధారణ వాహనాలకు ఎంత రుసుము వసూలు చేయాలి? భారీ వాహనాలకు ఎంత వసూలు చేయాలో అన్ని రాష్ట్రాల కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి.