హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. 150mm వర్షపాతం

-

గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి, నల్లగొండ ప్రాంతాంల్లో.. చెరువుల్ని తలపిస్తున్నాయి రోడ్లు. ఈ తరుణంలో హైదరాబాద్ లో 150mm వర్షపాతం నమోదైందని వెల్లడించింది వాతావరణ శాఖ.

Torrential rain lashed Hyderabad on Thursday morning
Torrential rain lashed Hyderabad on Thursday morning

దీంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు వాహనదారులు. అటు.. గచ్చిబౌలిలోనూ 81mm వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇక అటు న్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కొడుతున్నాయి. అర్ధరాత్రి కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో… జోరుగా వర్షాలు పడ్డాయి. ఇంకా కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఉత్తర తెలంగాణ జిల్లా ల్లో…. వర్షాలు భారీగా పడతాయని తెలిపింది. అదిలాబాదు, కొమురం భీమ్, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news