గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం : మహేష్ కుమార్ గౌడ్

-

మన దేశ దౌర్భాల్యం ఏమిటంటే ఈ రోజు గాడ్సే వారసులు మన దేశాన్ని పలిస్తున్నారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని మీ నానమ్మ గతి పడుతాది అనడం చాలా నేరం. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ తుడిచి పెట్టుక పోతుంది. హర్యానా లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం.

1989 లో రాజీవ్ గాంధీ మీద కుట్ర జరుగుతుంది అని అనుమానం వచ్చి కేంద్రం కీ తెలిపిన భద్రత ఇవ్వకపోవడం వల్లనే మనం రాజీవ్ గాంధీని కోల్పోయాం. ప్రజాస్వామ్యం మీద విలువ లేకుండా బీజేపీ వ్యవహరిస్తుంది. మీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుందనడం ఎంతవరకు సమంజసం. ఇందిరా గాంధీ ప్రాణాలు తీవ్రవాదులు ఎందుకు తీశారు. దేశ భద్రతను కాపాడే ప్రయత్నం చేస్తే తీవ్రవాదులు హతం చేశారు.రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇప్పుడు ఒక శక్తిగా మారారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకుకుడు ఆయన. కానీ తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version