చంద్రబాబుకు భయం లేదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

-

చంద్రబాబుకు భయం లేదు.. ఆయన జైలులో ఉన్నప్పుడు షూటింగ్ లు కూడా  చేయలేకపోయాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్.  ముఖ్యంగా రాష్ట్రంలో  6 నెలల్లో ప్రభుత్వం మారుతుందని అప్పుడే చెప్పాను. మంచి మనస్సు ఉండవచ్చు.. ప్రతిభ అనుభవం లేనప్పుడు ఎవ్వరికైనా కష్టం అవుతుంది. పెన్షన్లు  రూ.4వేలు ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఒకే రోజు అందరికీ ఇవ్వడం తిరుగులేని చరిత్ర అన్నారు. మొదటినెల ఒకేరోజు రూ.7వేల పెన్షన్ అందించినందుకు సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.

వాస్తవానికి పెన్షన్లు పెంచాలంటే ఖజానాల్లో డబ్బులు లేవు. రాజకీయాల్లో అవమానాలుంటాయి.. భరించి ముందుకెల్లాలని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు పెన్షన్లుపెంచామని తెలిపారు. అన్నా క్యాంటిన్లను ప్రారంభించిన తరువాత లైన్ లో ఉన్నారు. గత ప్రభుత్వం ఎలా తీసేసిందని నా కడుపు తరుక్కుపోయింది. నేతల సమిష్టి కృషితోనే ఎన్నికల్లో గెలిచాం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే నన్ను ఇబ్బంది పెట్టారు.ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version