టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం ఫేస్బుక్ లైవ్ లో టీఆర్ఎస్, బిజెపిపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని.. కేంద్రం లో ఉన్న బీజేపీ సర్కర్ వల్ల గ్యాస్,డీజిల్,పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయి…మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడని ఆగ్రహించారు. డబుల్ బెడ్ రూమ్,ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.. వారికి ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీల ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి ఉందని రేవంత్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news