అతని అడుగు దేశాన్ని ఐక్యం చేసింది.. ప్రజలకు నమ్మకాన్నిచ్చింది : రేవంత్ రెడ్డి

-

దేశంలో ద్వేషం అంతమై ప్రజలంతా ఏకమయ్యేంత వరకూ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దాదాపు 4 వేల కిలోమీటర్లు నడిచారు.

దేశ ఉత్తమ భవిష్యత్‌కు పునాదులు వేసేందుకు దేశ ఐక్యత,ప్రేమ కోసం కోట్ల పాదాలు కదిలాయని రాహుల్ పోస్ట్ చేశారు. ద్వేషం అంతమై ప్రజలు ఏకమయ్యే వరకూ యాత్ర కొనసాగుతుందని, ఇదే తన హామీ అని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర వీడియోను కూడా షేర్ చేశారు.

మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్​ను కొనియాడుతూ పోస్టు పెట్టారు. ‘అతని అడుగు దేశాన్ని ఐక్యం చేసింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత పటిష్ఠం చేసింది. పేదలకు భరోసా ఇచ్చింది. మధ్యతరగతికి నమ్మకాన్ని ఇచ్చింది. మనిషికి ప్రేమను పంచింది. ప్రత్యర్థికి సవాల్ విసిరింది. దోపిడీని ప్రశ్నించింది. ఆ మహాయజ్ఞం ‘భారత్ జోడో’ మొదలై ఏడాదైన సందర్భంగా శుభాకాంక్షలు.’ అని ఎక్స్​(ట్విటర్​)లో రేవంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news