ధాన్యం కొనుగోళ్ల వ్య‌వ‌హారంపై టీపీసీసీ కీల‌క స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేడు గాంధీ భ‌వ‌న్ లో కీల‌క స‌మావేశం నిర్వహించింది. వ‌రి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌ట్ల అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఈ సమావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ మానిక్కం ఠాకూర్ ఆధ్వ‌రంలో ఈ స‌మావేశం నిర్వ‌హించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వ‌రి ధాన్యం కొనుగోళ్లపై నిర్ల‌క్ష్యం జ‌రిగింతే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారం పై టీఆర్ఎస్, బీజేపీ ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీయాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ మానిక్కం ఠాకూర్ అన్నారు. అలాగే ఈ స‌మావేశంలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న గురించి కూడా చర్చ జ‌రిగింది. వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేయాల్సిన బ‌హిరంగ స‌భ తో పాటు రాహుల్ గాంధీ పూర్తి ప‌ర్య‌ట‌నపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చ‌ర్చించారు. కాగ రాహుల్ గాంధీ మే నెల‌లో 4, 5 తేదీల్లో తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు.