ఈనెల 08న టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ..!

-

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఈనెల 08వ తేదీన భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో జరిగే టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కే సీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరుగనున్న ఈ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తరణ, భవిష్యత్, కార్యచరణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, కులగణన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన నిర్ణయాలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news