సిద్దిపేట ప్రజలకు అదిరిపోయే శుభవార్త.ఆరు దశాబ్దాల సిద్దిపేట కళ, తెలంగాణ స్వరాష్ట్రంలో రైలు కళ నెరవేరనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల నిరంతర పర్యవేక్షణతో పట్టుదలతో సిద్దిపేట రైల్వే లైన్ కళ నెరవేరింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దీనివల్ల దశాబ్దాల కొద్ది రైల్వే ఆశ అడియాసగా ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట రైల్వే లైన్ కోసం అవసరమైన భూమి, నిధులు ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు వ్యయం భరించారు. దీంతో 3న సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ ట్రైన్ ప్రారంభం కానుంది. స్టేషన్లు ఒకసారి పరిశీలిస్తే….. సిద్దిపేట నుండి సికింద్రాబాద్ కు వారంలో ఆరు రోజులు రెండు ట్రిప్పులు రైలు నడవనున్నట్లు సమాచారం. సిద్దిపేట వద్ద ప్రారంభమైన రైలు దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, బేగంపేట్ హాల్ట్, నాచారం, మనోహరాబాద్ జంక్షన్, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, బొల్లారం, అశ్వికదళ బ్యారక్స్, మల్కాజ్గిరి స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్ కు చేరనుంది. రోజుకు రెండు ట్రిప్పులు తిరగనుంది.