ఈనెల 16 నుంచి సివిల్ ఎస్ఐలకు ట్రైనింగ్

-

తెలంగాణ సివిల్ ఎస్సైలకు బిగ్ అలర్ట్. ఇటీవల కొత్తగా ఎంపికైన సివిల్ ఎస్సైలకు ఈనెల 16 నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు RBVRR పోలీస్ TS అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్తగా ఎంపికైన 414 మంది సివిల్ ఎస్సైలతో పాటు గతంలో వివిధ కారణాలతో ట్రైనింగ్ పూర్తి చేయని మరో 19 మందికి ట్రైనింగ్ ప్రారంభం కానుంది.

ఈ నెల 10న వారు అకాడమీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మిగిలిన విభాగాల ఎస్సైలు 3 నెలల తర్వాత ట్రైనింగ్ కు వస్తారు. కాగా, ఇవాళ ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా తోలుత ఈనెల 6న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. తాజాగా ఆ సెలవును 7వ తేదీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఇవాళ సెలవు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news