తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 62 మంది డీఎస్పీల బదిలీలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాదులో పలువురు ఏసీపీలో బదిలీలు చేసింది. డీజీ ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీలందరికీ పోస్టింగ్ లు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 300 పై చిలుకు డీఎస్పీల బదిలీలు చేపట్టింది.
కాగా…ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో జరిగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.