BRS: హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కలకలం రేపుతోంది. హరీశ్ రావు మెడలో TRS కండువా వచ్చింది. బీఆర్ఎస్‌ను మళ్లీ TRSగా మారుస్తారని వార్తలు వస్తన్న క్రమంలో హరీశ్ రావు ఇలా కనపడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అందరూ బీఆర్‌ఎస్ పార్టీని టీఆర్‌ఎస్ గా మార్చుతున్నారని ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ విషయం బయట పడింది.
ఇక ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ… బీఆర్ఎస్ను వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు తాము నిద్రపోమని అన్నారు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని తెలిపారు. ఆ నాయకుల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు.
‘2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభమైంది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్లు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. మహిపాల్ రెడ్డిని మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది. ఏం తక్కువ చేసిందని మహిపాల్ రెడ్డి పార్టీ మారారు..? ఆయనకి మనసు ఎలా వచ్చింది? తల్లిలా పార్టీ మహిపాల్ రెడ్డిని దగ్గర చేసింది పార్టీ. గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దు అని కోరారు.