ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు తీర్పు 2 వారాలు నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును రెండు వారాల పాటు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. గత తీర్పులపై 2 వారాలు సస్పెన్షన్ ఇవ్వాలని సింగిల్ జడ్జిని కోరింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని ఏజీ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తితో మధ్యాహ్నం 2.30కి లంచ్ మోషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం 111 పేజీల తీర్పు వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news