Sidhu Jonnalagadda : SVCC బ్యానర్‌ లో డీజే టిల్లు కొత్త సినిమా

-

ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబో లో తెరకెక్కించిన చిత్రం డీజే టిల్లు . చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 2022 సంవత్సరానికి గాను బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా జాబితాలోకి చేరిపోయింది.

 

గతంలో చిన్న సినిమాలతో.. సక్సెస్ లేక కొట్టుమిట్టాడిన సిద్దు జొన్నలగడ్డ ఈసారి డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన తెలంగాణ యాస ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ క్రమంలోని డీజే టిల్లు 2 సినిమా కూడా చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే, మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. SVCC బ్యానర్‌ లో వైష్ణవి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news