తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

-

అకాల వర్షాలకు భారీ నష్టాల్లో కూరుకుపోయి లబోదిబోమంటున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షానికి కొట్టుకుపోయి రైతు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలును ప్రభుత్వం అత్యవసరంగా పరిగణిస్తోందని చెప్పారు. అందుకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించినట్లు వెల్లడించారు.

‘రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునే సమయంలో ధ రతగ్గితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిల్లర్లు తరుగుతీస్తే కఠిన చర్యలు తప్పవు. గతేడాది ఈ సమయానికి 13.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడు 24.85 మెట్రిక్ టన్నులు కొన్నాం. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు, నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నాం. 2019లో మేడిగడ్డ ఆనకట్ట దెబ్బతిందని మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ పేర్కొంది. అప్పుడే నీళ్లు వదిలి బాగుచేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. మేడిగట్ట ఆనకట్టపై గ్యారంటీ లేదని నిపుణుల కమిటీ చెప్పింది.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news