తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖులు పాల్గొంటున్నారు. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ బర్కత్‌పురాలో కుటుంబసభ్యులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటు వేశారు. ఓబుల్‌రెడ్డి పాఠశాలలో వెంకయ్య నాయుడు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతి, తల్లి శాలినితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేతలు, ప్రముఖులు పిలుపునిచ్చారు.