అమ్మాయి కోసమే TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ పేపర్ లీక్ చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండటంతో…ప్రవీణ్ ను ప్రశ్నా పత్రం అడిగింది ఆ యువతి. కాన్ఫిడెన్సియల్ సిస్టం క్రెడెన్సియల్స్ తెలిసిన సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్…అడ్మినిస్ట్రేటివ్ సిస్టం పై పనిచేసే..ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి…అతని సిస్టంలో లాగిన్ అయ్యారు.
ఆ సిస్టం లో ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా…నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపుకున్నారు. ప్రవీణ్ దాన్ని ఆ అమ్మాయికి పంపాడు. అమ్మాయి తమ్ముడి నీ పరీక్షకు ప్రిపేర్ చేశాక…తమ్ముడి స్నేహితులకు తెలిసి…డబ్బులకు పేపర్ ను అడిగారు. అప్పుడు మొత్తం 14 లక్షలు మాట్లాడుకుని…4 లక్షలు ఆమె వుంచుకుని…10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చేలా…డీల్ కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ డీల్ లో డబ్బులు ఇచ్చే దగ్గరే తేడాలు వచ్చి…ఒక యువకుడు డయల్ 100 కు కాల్ చేసి …పేపర్ లీక్ విషయం చెప్పాడని గుర్తుంచారు. ఇక ఈ నిందితుల్లో మహిళ భర్త కూడా వున్నాడు.