ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలి సారిగా జనరల్ రూట్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. T-24, T-6, F-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ రూట్ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్‌పాస్‌కు 600, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూట్ పాస్‌కు 1000 ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు 50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్‌లోని 162 రూట్లలో ఈ రూట్ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రూట్ పాస్ తీసుకున్నవారు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లయినా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్‌తో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.