రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు – ఆర్టీసీ ఎండీ సజ్జానార్‌

-

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా TSRTC పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటన చేశారు. హైదరాబాద్‌ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించిందన్నారు.

TSRTC is making arrangements to avoid inconvenience to those going home for Sankranti

ప్రధాన ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందని వివరించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. వాటిని బస్‌ భవన్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేసింది. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారని పేర్కొన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news