TTD : భక్తులకు గమనిక.. టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు

-

TTD :  తిరుమల తిరుపతి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్సైట్ పేరు మారింది. ఇప్పటివరకు tirupatibalaji.ap.gov.in గా ఉండగా…. ttdevasthanams.ap.gov.in గా మార్చుతున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

ఆర్జిత సేవలు, దర్శన సమయం, రవాణా, దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల వివరాలను ఇందులో చూడొచ్చని చెప్పారు. కొత్త వెబ్ సైట్ : ttdevasthanams.ap.gov.in

ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం.. ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 61,511 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 20,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news