రైతులు మళ్ళీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు సిద్ధం..!

-

ఈ మంచి కాలంలో రైతులు సంతొషం గా వున్నారు. ప్రాజెక్టు లు నిండాయి. 7600 కోట్లు రైతులకు అందించాం. కాంగ్రెస్ పార్టీ హామి మేరకు రుణ మాఫీ చేశాం. 22 లక్షల ఖాతా కు 18000 కోట్లు వారి ఖాతా లో జమ చేశాం. ఇంకా కొద్ది మందికి ఇవనున్నాం. కానీ ఈ సంతోష సమయం లో ఉప ద్రవం వచ్చింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. మున్నేరు ఏరియాలో బారి వరద వచ్చింది. వంద ఏళ్ళ లో రాని వర్షం వరద వచ్చింది.ఇరిగేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. పత్తి పూత మీద వుంది. వరి దెబ్బ తిన్నది.

ప్రస్తుతం అధికారులను నష్టంపై సర్వే చేయమని చెప్పాను. కోటి 18 లక్షల వరకు ఇప్పటికీ సాగులోకి వచ్చింది. ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ఆ తరువాత సూర్యాపేట, మహబూబాబాద్ లో నష్టం జరిగింది. ఖమ్మం జిల్లాలో 48000 ఎకరాల నష్టం ప్రాథమిక సమాచారం మేరకు నష్టం జరిగింది. రైతులు మళ్ళీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సిద్ధం గా వుంచాం. ఎరువులు కూడా సిద్ధం గా వున్నాయి అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news