MMTS రైల్లో యువతిపై రేప్ కేసులో కీలక ట్విస్ట్

-

హైదరాబాద్‌ లోని MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటుచేసుకుంది. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తూ రైల్లో నుంచి యువతి జారిపడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తనపై అత్యాచారం జరిగింది అంటూ ఆ యువతి కట్టుకథ అల్లినట్లు తెలిసిందే. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. వారు చెప్పిన విషయాలతో కంగుతిన్న అధికారులు 250 సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యువతిని విచారించగా ఆమె చెప్పిన సమాధానాలతో పోలీసులకు అనుమానం మొదలైంది. ఇక వారు తమ స్టైల్లో విచారణ జరపగా ఆ యువతి అసలు విషయం చెప్పుకొచ్చింది. రీల్స్ చేస్తుండగా కింద పడ్డానని.. తనపై అత్యాచారం జరగలేదని.. చెప్పడంతో నిజానిజాలు నిర్ధారించిన పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news