కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలంటే..ఈ తప్పులను అస్సలు చేయకండి ..!

-

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే శుభ్రమైన ఇంట్లో సానుకూల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎన్నో ఇబ్బందుల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వంటగది ఎంతో శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే వంట గదిలో శుభ్రత తక్కువ అవుతుందో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతాయి. కనుక ఎప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని పొరపాట్లను చేయడం వలన మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను తప్పకుండా పాటించాలి.

సహజంగా ఇంట్లో ఆగ్నేయం వైపున వంటగది ఉంటే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతారు. ఎందుకంటే అగ్ని ఆగ్నేయం దిక్కును పరిపాలిస్తాడు. అందువలన ఈ దిశలో వంటగది ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. ఆగ్నేయం కు బదులుగా వాయువ్యం దిశలో కూడా వంటగది ఉండవచ్చు. కాకపోతే ఉత్తరం, ఈశాన్యం లేక నైరుతి దిశలో వంటగదిని ఏర్పాటు చేయకపోవడమే మేలు. అంతేకాకుండా వంట గదిలో ఏర్పాటు చేసే కొన్ని వస్తువులను కూడా సరైన దిశలో ఉండాలి. సింక్, వాటర్ ప్యూరిఫైయర్ వంటి వాటిని ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

అంతేకాకుండా ఆగ్నేయం వైపు స్టవ్ ఉండే విధంగా వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. వంట వండుతున్నప్పుడు తూర్పు ముఖంగా ఉండి చేయాలి. ఇలా చేస్తే ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది దాంతో కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు. దీంతో పాటుగా స్టవ్ ని ఎప్పుడు సింక్ ముందు లేక పక్కన ఉండకుండా చూసుకోవాలి. వంట గదిలో ఉండేటువంటి స్టోరేజ్ కు సంబంధించిన వస్తువులు దక్షిణం లేక పశ్చిమ గోడలకు ఉండే విధంగా చూడాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక ఇటువంటి పొరపాట్లను చేయకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news