TSPSC పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రీకుమారులు మైబయ్య, జనార్ధన్‌ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. కుమారుడి కోసం మైబయ్య రూ.2 లక్షలతో ఏఈ పేపర్ కొన్నాడని వెల్లడించారు. డాక్యాకు రూ.3 లక్షలు ఇచ్చి పేపర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసులో 19 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.

“మైబయ్య వికారాబాద్ ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ కేసులో మరో నిందితురాలైన రేణుక భర్త డాక్యా నాయక్‌తో మైబయ్యకు పరిచయం అయింది. మైబయ్య కొడుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నాడని తెలిసి డాక్యా నాయక్.. ఏఈ క్వశ్చన్ పేపర్‌ను ఆరు లక్షలకు బేరం పెట్టాడు. మైబయ్య రూ.2 లక్షల వరకు అయితే చెల్లించుకోగలుగుతానని చెప్పాడు. మైబయ్య తన ఖాతాకు డబ్బు బదిలీ చేసిన తర్వాత ఏఈ ప్రశ్నపత్రాన్ని అందించాడు డాక్యా. వెంటనే మైబయ్య తన కుమారుడికి ఆ పత్రాని ఇచ్చి పరీక్ష రాయించాడు.” అని సిట్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news